రెండు చోట్ల ఓడిన పవన్ ను చూసి వైసీపీ భయపడదన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. కౌలు రైతులకు వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని జనసేన ఆరోపించిందని.. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతుల పట్ల ఏ రకంగా వ్యవహరించారో టీడీపీ, జనసేన మర్చిపోయినట్లు ఉన్నారని పేర్కొన్నారు. రైతుల రుణమాఫీ రద్దు చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు?? రైతుల 87,600 కోట్ల రుణం మాఫీ చేస్తామని చెప్పి…తీరా చేసింది 15వేల కోట్లు మాత్రమేనని వెల్లడించారు.
రైతులకు పచ్చి దగా చేసింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాదా అని.. అప్పుడు రైతు భరోసా యాత్ర ఎందుకు చేయలేదని ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రైతులను నట్టేట ముంచటం వల్లే ఇవాళ అక్కడక్కడా రైతుల ఆత్మహత్యలు అని.. రైతు భరోసా కింద 50వేలు ఇస్తామని చెప్పి 67వేల రూపాయలు ఐదేళ్ళ ల్లో ఇస్తున్నామని గుర్తు చేశారు.
2019లో టీడీపీ వ్యతిరేక ఓటు చీలిపోయి జగన్ అధికారంలోకి రాకుండా ఉండటానికి వేరేగా పోటీ చేశారని…స్వయంగా తానే ఓడిపోయాడన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి పల్లకీ మోయనున్నావో జనసైనికులకు చెప్పాలని.. చంద్రబాబు కాపలాదారుడు నాదెండ్ల మనోహర్ అంటూ ఆరోపనలు చేశారు. పవన్ కళ్యాణ్ పక్కనే కూర్చుని ఎప్పటికప్పుడు చంద్రబాబు కు సమాచారం ఇస్తూ ఉంటాడని.. పవన్ కళ్యాణ్ అవునంటే కాదని అర్ధమన్నారు.