పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధూ ను టార్గెట్ చేస్తూ.. వివాదస్పద వ్యాఖ్యలు చేశారు అమరీందర్ సింగ్. సిద్ధూ నిలకడలేని మనిషి అని…. సిద్ధూ ని తెర పైకి తీసుకొస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తానని హెచ్చరించారు. పాక్ పీఎం, ఆర్మీ చీఫ్‌లకు సిద్ధూ స్నేహితుడు అని సంచలన ఆరోపణలు చేశారు. దేశం కోసం సిద్ధూ ని వ్యతి రేకిస్తానని స్పష్టం చేశారు అమరీందర్ సింగ్.
పాకిస్తాన్ కు పంజాబ్ ఆయుధంగా మారొచ్చని అమరీందర్ సింగ్ అభిప్రాయపడ్డాడు. తానంతట తానే రాజీనామా చేశానని.. కాంగ్రెస్ పార్టీ తన కిష్టమైన, విశ్వసించే నాయకుడును తదుపరి ముఖ్యమంత్రి గా ఎంచుకోవచ్చని తెలిపారు. సన్నిహితులతో, మద్దతుదారులతో మాట్లాడిన తర్వాత తదుపరి కార్యచరణను ప్రకటిస్తానన్నారు. తన ముందు పలు ప్రత్యామ్నాయాలున్నాయని వివరిం చారు అమరీందర్ సింగ్. కాగా ఇవాళ సాయంత్రం అమరీందర్ సింగ్… సీఎం పదవి కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.