ఆనం-కోటంరెడ్డిలతో వైసీపీకి ఎదురుదెబ్బ.!

-

వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా మారిన ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలతో వైసీపీకి షాక్ తగలనుందా? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్ట్ ఏమైనా? ఉంటుందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తే అదే జరిగేలా ఉంది. తమ నియోజకవర్గాలని పట్టించుకోకపోవడ, నిధులు ఇవ్వకపోవడం..తమపైనే నిఘా పెట్టడంతో కోటంరెడ్డి, ఆనం వైసీపీపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.

వైసీపీపైనే విమర్శలకు దిగి..ఆ పార్టీకి దూరం జరిగారు. ఇక వీరు టి‌డి‌పిలో చేరడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. అయితే ఇదే క్రమంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు..టి‌డి‌పి ఎమ్మెల్యేల కూర్చున్న వరుసలో కూర్చుంటున్నారు. అటు టి‌డి‌పిని వీడిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు కూర్చుంటున్న విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీకి వెళ్ళేముందు కోటంరెడ్డి ప్లకార్డు పట్టుకుని నిరసన తెలియజేస్తూ వచ్చారు. తన నియోజకవర్గ సమస్యలపై పోరాటం మొదలుపెట్టారు.  అసెంబ్లీ లోపల సైతం తన నియోజకవర్గ సమస్యలపై నిరసన. తెలుపుతున్నారు.

ఇక స్పీకర్ కలుగజేసుకుని ఏమైనా ఉంటే ప్రభుత్వానికి చెప్పాలని అన్నారు. మధ్యలో అంబటి రాంబాబు లేచి..టి‌డి‌పితో కలిసి కోటంరెడ్డి ఇలా చేస్తున్నారని, పుట్టగతులు ఉండవని అంటున్నారు. అదే సమయంలో టి‌డి‌పి నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీతో కలిసి పనిచేస్తున్నారని వారికి పుట్టగతులు ఉండవా? అంటూ టి‌డి‌పి ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు.

ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కో స్థానం గెలవాలంటే 22 ఎమ్మెల్యేలు కావాలి. రెబల్ ఎమ్మెల్యేలు తీసేస్తే..టి‌డి‌పికి 19మంది ఉన్నారు..వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కలిస్తే 21 అవుతారు..ఇంకో ఎమ్మెల్యే గాని ఇటు వస్తే వైసీపీ ఎదురుదెబ్బ తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news