పెయిటింగ్‌ గర్ల్‌కు ఆనంద్‌ మహీంద్ర ప్రశంసలు

-

టాలెంటెడ్ యంగ్ ఆర్టిస్టు అంటూ ఒక వీడియో ఇంటర్నెట్లో ఆకర్షణీయంగా నిలుస్తోంది. నూర్జహాన్ అనే యువతి స్పెషల్‌గా రూపొందించిన వీడియోపై పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. అద్భుత కళాకారిణి, అద్భుతమైన వీడియో అంటూ మంత్ర ముగ్ధులై పోయారు. ఒకేసారి 15 పోర్ట్రెయిట్ లను చిత్రించడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఆమె గ్రేట్ ఆర్టిస్ట్.. అసలు ఇది ఎలా సాధ్యం అంటూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశార. గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించిన బాలిక వీడియోను మహింద్ర గ్రూప్‌ చైర్మన్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహింద్ర ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. బాలిక ఫీట్‌ ఆనంద్‌ మహింద్రను ఇంప్రెస్‌ చేయడంతో ఈ వీడియోను ఆయన ఆన్‌లైన్‌లో షేర్‌ చేయగా ప్రస్తుతం ఆ క్లిప్‌ నెట్టింట వైరలవుతోంది. సోషల్‌ మీడియాలో ఈ వీడియోకు ఇప్పటివరకూ ఏకంగా 5 లక్షల పైగా వ్యూస్‌ లభించాయి.

ఈ వైరల్‌ వీడియో ఆరంభంలో బాలిక తన మాస్టర్‌పీస్‌ పక్కన నిలుచుని ఉండటం కనిపించింది. ఆపై కొన్ని స్టిక్స్‌కు వాటి కింద పెన్నులను అమర్చింది. కాన్వాస్‌ పీస్‌ను 15 భాగాలుగా డివైడ్‌ చేసి పలువురు స్వాతంత్ర సమరయోధుల పెయింటింగ్స్‌ వేయడం ప్రారంభించింది. అసలు ఇదెలా సాధ్యం..? ఆమె నైపుణ్యం కలిగిన ఆర్టిస్ట్‌..అయినా ఒకేసారి 15 చిత్రపటాలను వేయడం కళ కంటే గొప్పదైన అద్భుతం..ఇది నిజమని అక్కడున్న వారెవరైనా నిర్ధారిస్తే ఆ బాలికకు స్కాలర్‌షిప్‌తో పాటు అవసరమైన సాయం అందిస్తా అని పోస్ట్‌కు క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకోగా బాలిక నైపుణ్యంపై పలువురు యూజర్లు ప్రశంసలు గుప్పించారు. ఇది అసాధారణ నైపుణ్యమని కొందరు మెచ్చుకోగా, బాలిక టాలెంట్ నమ్మలేకపోతున్నామని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్‌ సెక్షన్‌లో రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version