దర్జా మూవీ రివ్యూ: డాన్ గా అనసూయ మెప్పించిందా?సినిమా ఎలా ఉందంటే?

-

సినిమా: దర్జా
నటీనటులు: సునీల్, అనసూయ భరద్వాజ్, షఫీ, ఆమని, ’30’ ఇయర్స్ పృథ్వీ, అక్సా ఖాన్, షమ్ము, ‘షకలక’ శంకర్, ‘మిర్చి’ హేమంత్, ‘ఛత్రపతి’ శేఖర్, ‘షేకింగ్’ శేషు, ‘జబర్దస్త్’ నాగిరెడ్డి, సమీర్ తదితరులు..
కథ: నజీర్
మాటలు : పి. రాజేంద్రకుమార్, నజీర్, భవానీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: దర్శన్
సంగీతం: ర్యాప్ రాక్ షకీల్
నిర్మాత: శివ శంకర్ పైడిపాటి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సలీం మాలిక్
విడుదల తేదీ: జూలై 22, 2022

యాంకర్ అనసూయ సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే..అయితే అప్పుడప్పుడు హీరోయిన్ గా కూడా సినిమాలను చేస్తున్నారు.అలా వచ్చిన ఏ సినిమా కూడా అమ్మడుకు కలిసి రాలేదు..అయిన వెనక్కి తగ్గకుండా వరుస సినిమాలు చేస్తుంది. ఇప్పుడు హీరోయిన్ గా దర్జా సినిమాలో నటించింది ఆ సినిమా ఈరోజు విడుదల అయ్యింది..సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

కథ, విశ్లేషణ:

కనకం అలియాస్ కనక మహాలక్ష్మి (అనసూయ) అంటే బందరులో అందరికీ హడల్. తన మాట వినని పోలీసులను చంపేస్తుంది. తన సాయంతో ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఎదురు తిరిగితే ఆయన కుమార్తెను తమ్ముడితో రేప్ చేయించి చంపిస్తుంది. బందరు నేల మీద తిరుగు లేని కనకం… సముద్రంపై కూడా పట్టు సాధించాలని అనుకుంటుంది. బందరు పోర్టు కాంట్రాక్టు సొంతం చేసుకోవాలని పావులు కదుపుతుంది. ఎదురే లేదనుకున్న కనకానికి ఏసీపీ శివ శంకర్ పైడిపాటి (సునీల్) రూపంలో సుడిగుండం అడ్డు వస్తుంది. మధ్యలో కనకం, ఆమె తమ్ముడు బళ్ళారిని చంపాలని తిరుగుతున్న రంగ ఎవరు? కనకం సామ్రాజ్యంలో అతడి అన్న, మూగవాడు అయినటువంటి గణేష్, తీన్మార్ గీత (అక్సా ఖాన్), పుష్ప పాత్ర ఏమిటి? కనకం అరాచకాలను ఏసీపీ శివ శంకర్ అడ్డుకున్నారా? లేదంటే అతడిని కనకం చంపేసిందా? అనేది సినిమా మొత్తం కథ..

ఈ సినిమాలో అనసూయ పాత్ర మెరుపు తీగలా కనిపిస్తుంది..అనసూయ పాత్రను అడ్డం పెట్టుకుని ప్రేక్షకులతో దర్శకుడు దాగుడుమూతలు ఆడారు. సునీల్ కూడా ఇంటర్వెల్‌కు ముందు ఎంట్రీ ఇచ్చారు. సెకండాఫ్‌లో ఆయన స్క్రీన్ టైమ్ కొంచెం ఎక్కువ ఉందని చెప్పాలి.
అనసూయ, సునీల్ స్క్రీన్ టైమ్ పక్కన పెట్టి సినిమాకు వస్తే… తెలుగు తెరపై పిప్పి పిప్పి చేసిన కథతో ‘దర్జా’ తీశారు. సునీల్ ఫ్లాష్‌బ్యాక్‌, బ్రదర్స్ రంగ – సురేష్ స్టోరీ, అనసూయ క్యారెక్టర్ బ్యాక్‌గ్రౌండ్‌ ఏదీ కొత్తగా ఉండదు. ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సినిమాలో చూసిన సన్నివేశాలు మళ్ళీ స్క్రీన్ మీద వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది..
కథ, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్స్ అంటూ విశ్లేషించడానికి ఏదీ లేదు. దర్శకుడు మొదలుకుని మిగతా టెక్నీషియన్లు అందరూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తారు. సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ అయితే చెవులకు పట్టిన తుప్పు వదిలేలా రీ రికార్డింగ్ చేశారు. నేపథ్య సంగీతంతో విధ్వంసం సృష్టించారు. పాటల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెస్ట్ అని టాక్ వినిపిస్తోంది.సునీల్ యాక్టింగ్. ఏసీపీగా డీసెంట్ పెర్ఫార్మన్స్‌తో న్యాయం చేసే ప్రయత్నం చేశారు.

సన్నివేశాలు ఆయనకు సహకరించ లేదనుకోండి… అది వేరే విషయం. అనసూయకు కనక మహాలక్ష్మి డిఫరెంట్ రోల్. ‘దర్జా’లోని పాటల్లో కంటే ‘ఢీ’ షోలో కంటెస్టెంట్‌గా అక్సా ఖాన్ అందంగా కనిపించారు. మంచి స్టెప్స్ వేశారు. ఆమని, ’30 ఇయర్స్’ పృథ్వీ, షఫీ, ‘ఛత్రపతి’ శేఖర్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులను సరిగా ఉపయోగించుకోలేదు. ‘షకలక’ శంకర్ సీన్స్ నవ్వించలేదు. పైగా, ఎప్పుడు అయిపోతాయా అని జనాలు వచ్చేసారు..చాలా మంది సినిమా మధ్యలోనే వచ్చారు.. ఇలాంటి సినిమా కోసం అంత దూరం వెళ్లాల్సిన పని లేదని కొందరు సినీ అభిమానులు అంటున్నారు..ఇలా చూసుకుంటే సినిమా యావరెజ్ అనే టాక్ వినిపిస్తోంది.. ఈ సినిమా కూడా అనుకు కలిసి రాలేదు..
రేటింగ్: 1/5

Read more RELATED
Recommended to you

Latest news