నాగ చైతన్య గురించి పచ్చి నిజాలు చెప్పిన సామ్..నిజమా?

-

సమంత పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్..ఎన్నో హిట్ సినిమాలలో నటించి యూత్ ను ఆకట్టుకుంది.ఒకవైపు సినిమాలు, మరో వైపు షోలు,వాణిజ్య ప్రకటనలు చేస్తూ ఫుల్ బిజిగా ఉంది. ఇకపోతే ఈ అమ్మడు నాగ చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే..ఈ విషయం పై జనాలకు ఒక క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. అయితే ఈ విషయం పై మొదటిసారి నోరు విప్పింది.. తాజాగా సామ్ హిందీలో ప్రసారమవుతున్న కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ కు వెళ్ళింది.

అక్షయ్ కుమార్ తో కలిసి ఊ అంటావా.. అంటూ రొమాంటిక్ డ్యాన్స్ చేసింది..అంతేకాదు నాగ చైతన్య విడాకుల విషయం పై వస్తున్న రుమెర్స్ చెక్ పెట్టింది.సమంత తన మాజీ భర్త నాగ చైతన్యతో ఉన్న సంబంధం గురించి, విడాకుల తర్వాత వ్యాపించిన పుకార్లపై స్పందించింది.. షో హోస్ట్ కరణ్ జోహార్ ‘నాగ చైతన్యను మీ ‘భర్త’ అని’ అనగా.. వెంటనే కల్పించుకున్న సమంత వెంటనే కరణ్ జోహర్ ని సరిదిద్ది ‘మాజీ భర్త’ అని చెప్పి షాక్ ఇవ్వడం విశేషం..

మీరు మా ఇద్దరినీ ఒక గదిలో ఉంచినట్లయితే ప్రస్తుతానికి గదిలో పదునైన వస్తువులను దాచవలసి ఉంటుంది ‘ అంటూ విడాకుల తర్వాత తమ మధ్య వైరం, దూరం గొడవలు బాగా పెరిగిపోయాయని సమంత చెప్పకనే చెప్పింది. ‘కానీ అది భవిష్యత్తులో ఎప్పుడైనా ఒకే గదిలో ఉండవచ్చు’ అంటూ ముక్తాయింపు ఇచ్చి ట్విస్ట్ ఇచ్చింది. నాగ చైతన్యతో విడాకులు సామరస్యంగా జరగలేదని సమంత క్లారిటీ ఇచ్చింది. నాగ చైతన్యతో విడాకులు తీసుకోవడం తనకు చాలా కష్టమని సమంత తెలిపింది. ‘విడాకులు చాలా కష్టమైంది. కానీ ఇప్పుడు బాగుంది. పర్లేదు. నేను ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాను.’ ప్రస్తుతానికి మామధ్య అనుకూలమైన పరిస్థితి లేదు’ అని సమంత తెలిపింది అసలు ఈ వృత్తిలోకి రావాలని అనుకోలేదని.. ఎందుకంటే ఇంట్లో కష్టాలు ఉన్నాయి. మా దగ్గర ఇంకా పెద్దగా డబ్బు లేదు.. కానీ అవేవీ లేకున్నా నిజంగా సంతోషంగానే ఉన్నానని సమంత తెలిపింది.
విడిపోయిన తర్వాత సమంత వందల కోట్ల భరణం తీసుకుందని సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి కరణ్ ప్రశ్నించగా సమంత ఆసక్తికరంగా సమాధానమిచ్చింది. 250 కోట్లు భరణంగా తీసుకున్నట్లు తనపై వార్తలు వచ్చాయని సమంత తెలిపింది.

ఈ భరణం గురించి నివేదికలు వెలువడిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ అధికారులు తన ఇంటిపై దాడి చేయడానికి వచ్చారని సమంత చమత్కరించింది. ‘ నేను దాని గురించి నిజంగా ఫిర్యాదు చేయలేను ఎందుకంటే నేను ఆ మార్గాన్ని ఎంచుకున్నాను. నేను పారదర్శకంగా ఉండాలని అనుకుంటున్నారు. అందుకే సినీ ప్రయాణాన్ని తిరిగి ఎంచుకున్నాను. నా జీవితంలో చాలా విషయాలు వెల్లడిస్తాను. విడిపోయినప్పుడు నేను దాని గురించి చాలా కలత చెందలేకపోయాను ఎందుకంటే వారు నా జీవితంలో పెట్టుబడి పెట్టారు.

ఆ సమయంలో నేను లేని సమాధానాలను కలిగి ఉండటం నా బాధ్యత అని నేను అనుకుంటున్నాను. నేను దాని నుండి బయటకు వచ్చాను. ఏది జరిగినా నాకు మంచిదే.’ అంటూ సమంత విడాకులకు దారితీసిన పరిస్థితులను పరోక్షంగా చెప్పుకొచ్చింది. తనను సినిమాల్లో ఒక పెట్టుబడిగా చూశారని సమంత ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది..ఆఫ్ కెమెరా తర్వాత పూర్తీ విషయాలను చెబుతాను అని చెప్పి కట్ చేసింది.. షోకు ఈ టాపిక్ హైలెట్ అయ్యింది..ఇప్పుడు ఈ షో వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news