ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం.. పూర్తిస్థాయి బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అప్పటి వైఎస్ జగన్ సర్కార్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.అయితే, గత వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు వచ్చే నెలాఖరుతో ముగియనుంది.. ఈ నేపథ్యంలో.. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం అవుతోంది .దీని కోసం వచ్చే నెల (జులై) మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సమావేశాల్లో ఆగస్టు 2024 నుంచి మార్చి 2025 వరకు అవసరమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టి.. ఆమోదం తెలపడానికి ఈ అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేకంగా చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించనున్నారు.. అయితే, త్వరలో అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ముగియనున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో తాజాగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను రూపొందిస్తారు. ఇక ఆ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చలు జరుపుతారు. అనంతరం దాని ఆమోదింపజేయడమే అజెండాగా ఈ సమావేశాలు సాగనున్నాయి.