ఏపీలో మద్యపాన నిషేధంపై పవన్ కళ్యాణ్ సెటైర్లు

-

ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. టీడీపీ, జనసేన అధికార వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. వచ్చిన ఏ అవకాశాన్ని కూడా ప్రతిపక్షాలు వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా జనసేన పార్టీ వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను టార్గెట్ చేస్తోంది. తాజాగా ఏపీలో మద్యపాన నిషేధంపై జనసేనాని పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. ప్రభుత్వాన్ని విమర్శించారు. ట్విట్టర్ లో ఏపీలో మధ్యపాన నిషేధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

‘‘ సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం చిన్న గమనిక: సారా బట్టీలు,బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే. ఆ అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికే.. సామెతలు 12:22 అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు’’ అంటూ ట్విట్టర్ లో ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. అంతకు ముందు జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా మద్యపాన నిషేధంపై ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సంపూర్ణ మద్యపాన నిషేధం అనగా మద్యం ఆదాయం రూ.9 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు పెంచుట !! ఆ రాబడి చూపించి రూ.8 వేల కోట్ల బాండ్లు బజార్లో అమ్ముట ! ఇదీ ‘స్పిరిటెడ్ విజనరీ’’ అంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version