ఫోన్ ట్యాపింగ్ కేసు పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. ఈ కేసు పై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పర్యవేక్షణలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో రాజకీయ నాయకులే కాదు.. సినీ నటులు, వ్యాపారులు కూడా ఉన్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి.
దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని దెబ్బ తీసేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో డబ్బులు పంపిణీ చేసినట్టు పోలీసుల విచారణలో అధికారులు ఒప్పుకున్నారు. పోలీసులే మిగతా పోలీసులపై చర్యలు తీసుకోవడం కష్టమని.. కేసులోని పలువురు నిందితులు సహచరులు కాబట్టి కేసును ప్రభావితం చేసే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.