అమరావతి దేవతల రాజధాని… బాబుని అక్కున చేర్చుకున్నారు!

-

గతం ఎలా ఉన్నా… సీనియర్ అనే నమ్మకంతో విభజిత ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు చంద్రబాబుకు పట్టంకట్టారు. తన సీనియారిటీతో రాష్ట్రాన్ని గాడిలో పెడతారని భావించారు. అవినీతి రహిత పాలనను ఊహించారు. అక్రమాలకు తావులేకుండా నడుపుతారని నమ్మారు. రాజధాని నిర్మాణం విషయంలో కూడా ఎక్కడా అవినీతి పనులకు, అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వ భూములను ఉపయోగించుకుంటూ ముందుకుపోతారని నమ్మారు.. కానీ బాబు అది తప్ప అన్నీ చేశారు! ఫలితం సుస్పష్టం!

అమరావతి విషయంలో నాడు అధికారమైకంలో బాబు చేసిన తప్పులన్నింటి ప్రతిఫలం దశలవారిగా 2019 ఎన్నికల ఫలితాల నుంచి వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటివరకూ అమరావతి గురించి అన్ని మాటలూ చెప్పిన టీడీపీ నేతలు ఇప్పుడు.. ఆధ్యాత్మిక యాంగిల్ కూడా బలంగా కలుపుతున్నారు! అందులో భాగంగా… అమరావతి అనేది దేవతల రాజధాని అంటున్నారు!

అవును… విభజన తర్వాత ఏపీ ప్రజలంతా తమకు జరిగిన మోసానికి ఉక్కిరిబిక్కిరీ అవుతుంటే… సాక్ష్యాత్తు ఆ దేవతల రాజధాని అమరావతే తమ రాజధానిగా రాబోతోందని తెలుసుకుని ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. రాజధానినందించిన చంద్రబాబుని అక్కున చేర్చుకున్నారు అని చెప్పుకొస్తునారు.. బ్రౌచర్లు పోస్ట్ చేస్తున్నారు! ఇక్కడ గమనించాల్సిన విషయాలు రెండు ఉన్నాయి!

ఒకటి… దేవతల రాజధాని అమారావతిని చంద్రబాబు ఏపీకోసం తెస్తున్నారని చెప్పడం కాగా… “రాజధానినందించిన చంద్రబాబుని అక్కున చేర్చుకున్నారు” అని చెప్పడం! విడతలవారీగా వెలుగులోకి వస్తోన్న అమారవతిలోని అవినీతి పనులు.. ఆ రాజధాని దేవతలది కాదని చెప్పకనే చెప్పింది! ఇదే సమయంలో ఏపీకి అమరావతిని రాజధానిగా ప్రకటించి బొమ్మలు చూపించిన బాబును.. ఏపీ ప్రజలు అక్కున చేర్చుకున్నారని చెప్పడం. అమరావతి ప్రకటన, భూసేకరణ, గ్రాఫిక్స్, విదేశీ యాత్రల అనంతరం జరిగిన ఎన్నికలు 2019!

ఆ ఎన్నికల్లో 23 సీట్లు ఇచ్చి దూరం పెడితే… అక్కున చేర్చుకున్నారని చెప్పుకోవడానికి మించిన నిస్సిగ్గు వ్యవహారం మరొకటి ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి! ఏది ఏమైనా… బాబుకు వచ్చిన ఈ దేవతల రాజధాని నిర్మాణం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని అన్ని పనులూ చక్కబెట్టి, అవినీతి లేకుండా, అక్రమాలకు తావివ్వకుండా చూసుకుని ఉంటే.. నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నిజంగా ప్రజలు అక్కున చేర్చుకుని ఉండేవారేమో!!

Read more RELATED
Recommended to you

Latest news