ఏపీలో షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు – అంబటి రాంబాబు

-

ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఈ ఏడాది జూన్ మొదటి రోజే సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని… ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డులు కూడా సమావేశాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ వల్ల పోలవరం పనులు కాస్త ఆలస్యం జరిగిందని.. చంద్రబాబు, దేవినేని ఉమ స్వార్థ, అనాలోచిత నిర్ణయాల వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిందని వెల్లడించారు.

ప్రపంచంలో ఇంత వరకు ఎక్కడా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న సంఘటన చోటు చేసుకోలేదని.. కొన్ని పత్రికల ఆరాటమే తప్ప చంద్రబాబు రాజకీయంగా బతకరని విమర్శలు చేశారు. అక్క ఆరాటమే తప్ప బావ బతకడని.. రైతులకు తొందరగా నీళ్ళు ఇచ్చి మూడు పంటలకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. చంద్రబాబు పగటి కలలు కంటున్నాడని.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని తేల్చి చెప్పారు. ఎంత మంది, ఏ రకంగా వచ్చినా వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు అంబటి రాంబాబు.

Read more RELATED
Recommended to you

Latest news