‘చంద్రబాబు గారి దత్తపుత్రుడు’ అనే సినిమా తీస్తాం – అంబటి రాంబాబు

-

చంద్రబాబు గారి దత్తపుత్రుడు’ అనే టైటిల్‌తో మేం సినిమా తీస్తాం.. ఎక్కువ మంది హీరోయిన్‌లు అవసరం అవుతారని నిర్మాతలు ముందుకు రావడం లేదని పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు పేల్చారు. జగన్‌ను గద్దె దించడం పవన్ కళ్యాణ్‌ వల్ల కాదు.. ఆయనకు ప్యాకేజీలు ఇస్తున్న చంద్రబాబు వల్ల కూడా కాదన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబును గద్దెను ఎక్కించటమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని.. సెటైర్లు వేసే హక్కు దత్తపుత్రుడికే ఉంటుందా?? అని చురకలు అంటించారు.

పవన్ కళ్యాణ్‌కు స్క్రీన్ ప్లే రాయటం వచ్చు అన్నారని.. మాకు సినిమా తీయటం కూడా వచ్చన్నారు. దత్తపుత్రుడు, చంద్రబాబు గారి దత్తపుత్రుడు… టైటిల్ బాగుందా?? అని ఎద్దేవా చేశారు. జగన్‌ను గద్దె దించటం పవన్ కళ్యాణ్ వల్ల కాదు…ఆయనకు ప్యాకేజీలు ఇస్తున్న చంద్రబాబు వల్ల కూడా కాదని తెలిచి చెప్పారు. ధైర్యం, దమ్ము ఉన్న నాయకుడు జగన్ అని.. కాంగ్రెస్, టీడీపీ కలిసి కక్షకట్టి కేసులు పెట్టినా మొక్కవోని ధైర్యంతో నిలబడి పోరాడిన నాయకుడు జగన్ అని కొనియాడారు. అరెస్టుకు, కన్వెన్షన్‌కు తేడా తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news