AP : అంగన్‌వాడీలతో ఏపీ సర్కార్ చర్చలు సఫలం అయ్యాయి. దీంతో నేటి నుంచి విధుల్లోకి అంగన్‌వాడీలు రానున్నారు. 11 డిమాండ్లలో ఇప్పటికే 10 డిమాండ్ల అమలుకు కార్యాచరణ చేపట్టింది జగన్ సర్కార్. రిటైర్మెంట్ బెనిఫిట్స్ భారీగా పెంచింది ఏపీ ప్రభుత్వం. నిన్న అర్ధరాత్రి బొత్స, సజ్జల నేతృత్వంలో అంగన్‌వాడీలతో ఏపీ సర్కార్ చర్చలు జరిపింది.
ఇప్పటికే అంగన్వాడీలు సమ్మె విరమించాలని విఙప్తి చేసిన ప్రభుత్వం…అంగన్‌వాడీలతో చర్చలు సఫలం చేసుకుంది. ఇక ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ…పదవీ విరమణ వయసు 60ఏళ్ల నుంచి 62ఏళ్లకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.20వేల మట్టి ఖర్చులు భరిస్తామన్నారు. వేతనాల పెంపు జూలై నుంచి అమలు చేసేలా హామీ.. సమ్మెకాలంలో వేతనాలు, పోలీసు కేసులపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు మంత్రి బొత్స సత్యనారాయణ.