వాలంటీర్ల డేటా సేకరణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో వివాదస్పద ట్వీట్ చేశారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా డేటా సేకరణపై ఆందోళన వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్ల వీడియోను ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. వాలంటీర్లు సేకరిస్తోన్న డేటా ఎక్కడికెళ్తోందనేదే అందరి ఆందోళన అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
ఎవరు సీఎంగా ఉన్నా.. డేటా గోప్యతా చట్టాలు అలాగే ఉంటాయని చెప్పారు. అసలు వాలంటీర్ల బాస్ ఎవరు? AP ప్రజల వ్యక్తిగత డేటాను ప్రభుత్వం ఎక్కడ స్టోర్ చేస్తున్నారు? అని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించేందుకు వాలంటీర్లకు ఎవరు అధికారం ఇచ్చారు..? అని నిలదీశారు పవన్ కళ్యాణ్. మూడు ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వండని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్.
Everyone’s concern is same .. my dear Watson!. Data privacy laws will remain the same,whether you are CM or not. So answer these basic three questions.
1) Who’s the Boss of Volunteers?
2) Where are you storing the
personal data of People of AP?
3) Who has authorised… pic.twitter.com/oWsMb04RCj— Pawan Kalyan (@PawanKalyan) July 23, 2023