ఎక్కువ మాట్లాడితే… పిల్లలు పుట్టరు…తెలుసుకో లోకేష్ – మంత్రి అమర్నాథ్

ఎక్కువ మాట్లాడితే… పిల్లలు పుట్టరు…తెలుసుకో అంటూ నారా లోకేష్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి అమర్నాథ్. నాలుగు వేల కోట్లు పెట్టుబడులు తిరుపతికి వస్తే లోకేష్ ట్వీట్ చేసి విమర్శలు చేస్తారు…ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హెచ్చరించారు. మాట్లాడితే పిల్లలు పుట్టరనే విషయం లోకేష్ కు తెలియాలని ఎద్దేవా చేశారు.

అయ్యన్నపాత్రుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి అమర్నాథ్… మరోసారి జగన్మోహన్ రెడ్డి మాట ఎత్తితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. అధికారంలో ఉన్నాం భయపడకండి… అయ్యన్నపాత్రుడు గ్రామాల్లోకి వస్తే తరిమి కొట్టండని పిలుపు ఇచ్చారు. లిప్ స్టిక్ ఎక్కువ రాసుకుంటుందని అనితకు చంద్రబాబు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షరాల్ని చేశారని.. అనిత వైఖరి మరకపోతే నియోజకవర్గంలోకి వచ్చి బుద్ధి చెబుదాం అనుకున్నామని వెల్లడించారు. చంద్రబాబు 27ఏళ్ల యువకుడు ఏ విధంగా అవుతారో అనిత చెప్పాలని ఎద్దేవా చేశారు మంత్రి అమర్నాథ్.