బుడమేరు గండ్లు పూడిక పనులపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. బుడమేరు గండ్లు పూడిక పనుల్లో అర్ధరాత్రి భారీ వర్షం, ఉదృత గాలి వీస్తున్న నిద్రాహారాలు మాని నిమగ్నమైన మంత్రి నిమ్మల రామానాయుడు….అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజాము వరకు ఏకధాటిగా కురుస్తున్న వర్షంలో సైతం గట్టుపైనే గడిపారు. గండ్లు పూడిక జరిగితే గాని సింగ్ నగర్ కు వరద ఉధృతి తగ్గదనే ఉద్దేశంతోనే దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నానని తెలిపారు మంత్రి రామానాయుడు.
సింగ్ నగర్ ప్రాంత ప్రజలకు ఉపశమనం కలిగించాలన్నద్దే ప్రభుత్వ ఉద్దేశమని…గత నాలుగు రోజులుగా గట్టు వెంబడే ఉంటూ పూడిక పనుల్లో వేగవంతం చేసామని తెలిపారు మంత్రి రామానాయుడు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు ఎప్పటికప్పుడు బుడమేరు గండ్లు పూడిక పనులపై సమీక్ష చేస్తున్నారని వివరించారు. బుడమేరు గండ్లు పూడిక పనుల్లో అధికారులు, ఏజెన్సీ ల సహకారంతో ముందుకు వెళ్తున్నామన్నారు మంత్రి రామానాయుడు.