ఏపీ ప్రజలకు అలర్ట్‌.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

-

ఏపీ ప్రజలకు అలర్ట్‌.. నేడు అల్లూరి, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడొచ్చని పేర్కొంది.

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, సోమవారం నాటికి వాయుగుండంగా మారుతుందని తెలిపింది. తుపాను ముప్పు ఏపీకి ఉండకపోవచ్చని పేర్కొంది. ఇక అటు తెలంగాణకు మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version