ఏపీ వాసులకు చల్లటి కబురు.. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

-

ఏపీ వాసులకు చల్లటి కబురు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణ నుండి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతున్నది. దీని ఫలితంగాఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు పేర్కొంది వాతావరణ కేంద్రం.


ఉత్తర కోస్తా ఆంధ్ర:
——————————
ఈరోజు , రేపు మరియు ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా
రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర:
……………………
ఈరోజు , రేపు మరియు ఎల్లుండి వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది.

రాయలసీమ
———————-
ఈరోజు తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే
అవకాశం ఉంది., . మరియు ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది .రేపు మరియు ఎల్లుండి వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news