గోవాకు వెళ్లిన ఏపీ యువకుడిని కొట్టి చంపిన రెస్టారెంట్ మాఫియా !

-

గోవాకు వెళ్లిన ఏపీ యువకుడిని కొట్టి చంపింది రెస్టారెంట్ మాఫియా. న్యూ ఇయర్ వేడుకలకు గోవాకు వెళ్లిన ఏపీ యువకుడిని కర్రలతో కొట్టి చంపింది ఓ రెస్టారెంట్ మాఫియా. అయితే.. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. నూతన సంవత్సర వేడుకల కోసం తాడేపల్లిగూడెం నుంచి గోవా వెళ్లింది ఎనిమిది మంది స్నేహితుల బృందం.

AP youth who had gone to Goa for New Year celebrations was clubbed to death by the restaurant mafia

డిసెంబర్ 29 ఆదివారం అర్ధరాత్రి గోవాలో రెస్టారెంట్‌కు వెళ్లారు యువతీ, యువకులు. డిసెంబర్ 31న అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్ విషయంలో టూరిస్ట్‌లకు గోవా బీచ్లోని ఓ రెస్టారెంట్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రేట్ల గురించి ప్రశ్నించిన యువకులపై దాడి చేశారట రెస్టారెంట్ నిర్వాహకులు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ రవితేజ అనే యువకుడు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడట. ఇక ఈ సంఘటన పై గోవా పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version