160 స్థానాల్లో గెలిచి చంద్రబాబు సీఎం కాబోతున్నారు – అచ్చెన్నా

-

160 స్థానాల్లో గెలిచి చంద్రబాబు సీఎం కాబోతున్నారని.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్దంగా ఉందని.. గడప గడపకు వైసీపీ అని పెడితే ప్రజలు వెంటపడతారని గడప గడపకు మన ప్రభుత్వం అని పెట్టారని చురకలు అంటించారు. బాదుడే బడుడుతో టీడీపీ ప్రజల వద్దకు వెళ్తుందని పోటీగా వైసీపీ కార్యక్రమాలు చేస్తున్నారు..తాడికొండలో ప్రభుత్వ పనితీరుని ప్రశ్నించిన వెంకాయమ్మ అనే మహిళపై దాడి చేసి అక్రమ కేసులు పెట్టారని ఫైర్‌ అయ్యారు.

ఎన్నికలు ఎప్పుడు జరిగినా 160 స్థానాల్లో గెలిచి చంద్రబాబు సీఎం కాబోతున్నారు..వైసీపీ ఓ గాలి పార్టీ..గాలికొచ్చిన పార్టీ గాలికే పోతుందని విమర్శించారు. వైసీపీ కి అసలు రాజకీయ పార్టీ అని చెప్పుకునే అర్హతే లేదు..టీడీపీ నుండి వచ్చిన ఇద్దరికి, జగన్ దొంగ లెక్కలు రేసే ఒకరికి, సీబీఐ కేసులు వాదించే ఇంకొకరికి రాజ్యసభ సీట్లిచారన్నారు. బీసీలంటే టీడీపీ.. టీడీపీ అంటే బీసీలు.. ఈ బంధాన్ని జగన్ తల్లకిందులుగా తపస్సు చేసినా విడదీయలేరని స్పష్టం చేశారు. వైసీపీ ఎన్ని నాటకాలు ఆడినా బీసీలను టీడీపీ నుండి వేరుచేయటం జగన్ తరం కాదు… పదవులు ఇచ్చి బీసీల నోటికి ప్లాస్టరు వేస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news