జగన్ సర్కార్ కు మరో షాక్ తగిలింది. తాజాగా ఏపీ CRDA దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. అప్పుకు వడ్డీ కట్టాలని CRDA కార్యాలయానికి బ్యాంకర్లు వచ్చారు. 2019లో రూ.2,500 కోట్లు రుణం తీసుకున్న CRDA…. మూడేళ్ల క్రితం రుణం తీసుకున్న పనులు చేపట్టలేదు. మూడు నెలలకోసారి రూ.52 కోట్లు వడ్డీ కింద చెల్లించాల్సి ఉంటుంది.
జనవరిలో వడ్డీ చెల్లించని CRDA… సంబంధిత బ్యాంకులు లేఖలు రాసినా స్పందించలేదు CRDA అధికారులు. అయితే, వడ్డీ చెల్లించకపోవడంతో కార్యాలయానికి మూడు బ్యాంకుల అధికారులు వచ్చారు. దీంతో కార్యాలయానికి వస్తానని చెప్పి రాకుండా వెళ్లిన CRDA కమిషనర్… వేరే అధికారిని బ్యాంకర్ల దగ్గరకు పంపారు. మూడు గంటల పాటు ఎదురుచూసి వెళ్లిపోయిన బ్యాంకర్లు… ఉన్నతాధికారులకు సంబంధిత బ్యాంకుల అధికారులు నివేదిక పంపారు. CRDAను డిఫాల్టర్‌గా ప్రకటిస్తామని హెచ్చరించారు బ్యాంక్ అధికారులు.