టీడీపీ విజయం చూసి బొత్స ఉరేసుకోవాల్సి వస్తుంది – బోండా ఉమ

-

టీడీపీ విజయం చూసి బొత్స ఉరేసుకోవాల్సి వస్తుందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో చంద్రబాబు రాయలసీమ నుంచి శ్రీకాకుళం దాకా పది రోజులు యాత్ర, లోకేష్ యువగళం పాదయాత్ర లో వస్తున్న లక్షలాది మందిని చూసి వైసీపీకి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో చీపురుపల్లిలో బొత్సను, విజయనగరంలో బొత్స తమ్ముళ్లు, కుటుంబ సభ్యులను ఓడిస్తామని హెచ్చరించారు.

2024 లో గుండు చేపించుకోవడం కాదు టీడీపీ రిజల్ట్ చూసి విజయనగరం సెంటర్ లో బొత్స ఉరేసుకోవాల్సి వస్తుందని బాంబ్‌ పేల్చారు. బొత్స ఫ్యామిలీతో సహా దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్ లో ఉన్నారని తెలిపారు. మీకు అంత నమ్మకం ఉంటే ఉగాది దాకా ఎందుకు తక్షణమే ఎన్నికలు పెట్టండని… మీకు 175 కి 175 వస్తే మా పార్టీనే మూసేస్తామని సవాల్‌ విసిరారు. కోతలు రాయుడిలా కోతలు కొయొద్దు బొత్స సత్తిబాబు.. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ జనసేనలోకి వెళ్లాలని కాళ్లా వేళ్లా మొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారంలోకి వచ్చేది టీడీపీనేనని.. చంద్రబాబే ముఖ్యమంత్రి.. ఆపే శక్తి ఎవరికి లేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version