వైసీపీ ప్రభుత్వం మహిళల శీలాలకు వెలకడుతోంది – బోండా ఉమ

-

అమరావతి : అత్యాచార ఘటన విషయంవో రాజకీయం చేస్తోంది ప్రభుత్వమేనని…రాజ్యాంగ సంస్థైన మహిళా కమిషన్ వ్యవస్థను పార్టీ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ. చంద్రబాబు వస్తున్నారని తెలిసే ఆస్పత్రికి ప్రభుత్వం తన ప్రతినిధులని పంపి రాజకీయం చేసిందని…మహిళల హక్కుల కోసం పని చేయాల్సిన మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ తాడేపల్లి ప్రయోజనాల కోసం పని చేస్తున్నారనీ ఫైర్ అయ్యారు. తాడేపల్లి ఆదేశాల మేరకే వాసిరెడ్డి పద్మ సమన్లు జారీ చేశారు.వ్యక్తిగతంగా హాజరు కావాలని ఇచ్చిన సమన్లల్లో ఓ చోట ఈ నెల 27వ తేదీ అన్నారు.. మరో చోట నవంబర్ నెల 27వ తేదీ అన్నారన్నారు.

మొద్దు నిద్రలో ఉండి సమన్లు జారీ చేశారా..?ఏదో తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటే సరిపోతుందా..? అని ప్రశ్నించారు.చంద్రబాబు వచ్చాకే ప్రభుత్వానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.. మంత్రులు వచ్చి చెక్ అందచేశారు.వైసీపీ ప్రభుత్వం మహిళవ శీలాలకు వెలకడుతోందనీ ఫైర్ అయ్యారు.

బాధితుల పక్షాన మాట్లాడితే వాసిరెడ్డి పద్మ చేయ్యేత్తి కొట్టే ప్రయత్నం చేశారన్నారు. హక్కులు వాసిరెడ్డి పద్మకే కాదు.. మాకూ ఉన్నాయి.. మాకూ ఉన్నాయి…మహిళ కమిషన్ ఇచ్చిన సమన్లను న్యాయపరంగా ఏ విధంగా ఎదుర్కొవాలో మాకు తెలుసన్నారు. ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం..ఏం చేస్తారో చేసుకోండి.. మా వెంట్రుక కూడా పీకలేరని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news