ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ కేబినెట్ భేటీలో.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అమరావతిలో రూ.2,733 కోట్ల తో చేపట్టనున్న పనులతో పాటు సీఆర్డీఏ 44వ సమావేశం లో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు అంగీకారం తెలిపారు.
పిఠాపురం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ లో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులు జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణ కు ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే… మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. మొత్తం 14 అంశాల పై ఏపీ కేబినెట్ భేటీ కొనసాగింది. 19 నూతన పోస్టులకు అనుమతి తెలిందని అంటున్నారు.