Viveka Murder : వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి రిమాండ్ పొడిగింపు

-

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేసి విచారిస్తోంది. మరికొందరిని అరెస్టు చేయకుండా విచారిస్తోంది. ఈ క్రమంలో తాజాగా సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్​రెడ్డి రిమాండ్‌ను పొడిగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. జారీ చేసిన ఆ ఉత్తర్వుల్లో భాస్కర్​రెడ్డి రిమాండ్‌ను మే 10వ తేదీ వరకు పొడిగించింది.

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్​రెడ్డి రిమాండ్‌ను మే 10 తేదీ వరకు సీబీఐ కోర్టు పొడిగించింది. నేటితో నిందితుడు వైఎస్ భాస్కర్‌ రెడ్డి రిమాండ్‌ గడువు ముగియడంతో సీబీఐ అధికారులు చంచల్‌గూడ జైలు నుంచి భాస్కర్‌ రెడ్డిని కోర్టుకు తరలించి హాజరుపరచగా.. మే 10 తేదీ వరకు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. విచారణ అనంతరం నిందితుడు భాస్కర్‌ రెడ్డిని అధికారులు మళ్లీ చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version