కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంతో ఇటీవల జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు , హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది ప్రభుత్వం. వారం గడిచినా ఇంకా ఇంటర్నెట్ పై నిషేధం కొనసాగుతోంది. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమలో వారం రోజులైనా ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించలేక పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం. ఎక్కడో కాశ్మీర్ లో వినిపించే ‘ఇంటర్నెట్ సేవలు నిలిపివేత’ అనే వార్త ను మన సీమలో వినాల్సి రావడం బాధాకరంమని అన్నారు.
కోనసీమలో వారం రోజులైనా ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరించలేక పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం. ఎక్కడో కాశ్మీర్ లో వినిపించే 'ఇంటర్నెట్ సేవలు నిలిపివేత' అనే వార్త ను మన సీమలో వినాల్సి రావడం బాధాకరం.(1/3) pic.twitter.com/oiZCesUOy2
— N Chandrababu Naidu (@ncbn) May 31, 2022