వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తా – చంద్రబాబు సంచలన ప్రకటన

-

వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తానని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలను నట్టేట ముంచుతున్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారు. నేను అనుకుంటే వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తా. పశ్చిమగోదావరిలో ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీ పేరు మారుస్తా’ అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు చేశారు.

2014 ఎన్నికల్లో టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిందని, ఇప్పుడదే సీన్ 2024 ఎన్నికల్లో రిపీట్ అవుతుందని జగన్ వణికిపోతున్నాడని వ్యాఖ్యానించారు చంద్రబాబు. సిగ్గుమాలిన ముఖ్యమంత్రి… ఆడపిల్లల చున్నీలు కూడా తీసేయించిన ఈ పిరికి ముఖ్యమంత్రికి తెలుగుదేశం పార్టీ చుక్కలు చూపించడం తథ్యం అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news