పేర్నినానిలో ఏంట్రా ఈ మార్పు ? వింటే వావ్ అంటార్రా !  

-

ఉన్న‌ప‌ళాన మంత్రి పేర్ని నానిలో మార్పు వ‌చ్చింది. ఎప్పుడూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసే పేర్నినానిలో ఓ విధం అయిన మార్పు లేదా ప‌శ్చాత్తాపం క‌నిపించింది.ఆ విధంగా ఆయ‌న ఇవాళ మీడియా ఎదుట కాస్త త‌గ్గి మాట్లాడారు. లేదా మీడియా ముఖంగా కాస్త త‌గ్గే ఉన్నారు. త్వ‌ర‌లోనే త‌న ప‌ద‌వి ముగిసిపోతుంద‌ని స్ప‌ష్టంగా చెప్పారు. ఆ త‌రువాత కూడా మీకేమ‌యినా సాయం కావాలంటే చేస్తాను అని ప్ర‌యివేట్ బ‌స్ ఆప‌రేటర్స్ ను ఉద్దేశించి మాట్లాడారు.
ఇదే సంద‌ర్భంలో నా ప‌ద‌వీకాలంలో అంటే మూడేళ్ల కాలంలో ఎక్కువ త‌క్కువ‌లు ఏమ‌యినా మాట్లాడి ఉంటే త‌న‌ను క్ష‌మించాల‌ని కోరారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ అయింది. వాస్త‌వానికి పేర్నినాని అనే మంత్రి జ‌గ‌న్ కు వీర‌విధేయుడు. ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలో మంచి పేరున్న నాయ‌కుడు. అయినా కూడా ఆయ‌న‌ను కొనసాగించే అవ‌కాశ‌లే లేవ‌ని తేలిపోయింది. ఎంత‌టి వారు అయినా తాను చెప్పిన విధంగా ప‌దవులు వ‌దులుకునేందుకు సిద్ధంగా ఉండాల‌ని జ‌గ‌న్ చెప్పిన నేప‌థ్యంలో ఆయ‌న మాటే శాస‌నం క‌నుక త్వ‌ర‌లో పేర్నినాని సైడ్ అయిపోతున్నారు.

బూతుల మంత్రి కొడాలి నానిని మాత్రం కొన‌సాగించే అవ‌కాశాలు మెండుగానే ఉన్నాయి. గ‌తంలో పేర్నినాని ఎన్నో సార్లు జ‌గ‌న్ చెప్పినవన్నీ చేశారు. త‌న శాఖ‌కు సంబంధించినవి కాక‌పోయినా కూడా మాట్లాడారు. ర‌వాణా శాఖ మంత్రిగానే ఉంటూ స‌మాచార శాఖ‌ను కూడా చూశారు.

ఆఖ‌రి నిమిషాన సినిమాటోగ్ర‌ఫీ శాఖ‌ను నిర్వ‌హించి మొన్న‌టి వేళ భీమ్లా నాయక్ సినిమా విడుద‌ల స‌మ‌యంలో వివాదాల‌కు తావిచ్చేలా వ్యాఖ్య‌లు చేశారు. థియేట‌ర్ల‌కు అధికారుల‌ను పంపి మ‌రీ కౌంట‌ర్లలో తాము చెప్పిన విధంగా టికెట్లు అమ్మేలా ఆయ‌న చ‌ర్య‌లు తీసుకున్నారు.ఇవ‌న్నీ చేయించిన‌వి తెర వెనుక ఉన్న వైసీపీ పెద్ద‌లే అయినా ఆయ‌న వీర విధేయుడుగా ఉన్నారు క‌నుక వివాదాస్ప‌ద జీఓ అమ‌లుకు సాయ‌శ‌క్తులా కృషి చేశారు. తరువాత రివైజ్డ్ జీఓ వ‌చ్చింది. అందుకు మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న చొర‌వ,ఆయ‌న జ‌రిపిన సంప్ర‌తింపులు ఫ‌లించాయి.అప్పుడు కూడా పేర్ని నాని మాట్లాడారు. అదేవిధంగా మాట్లాడ కూడని మాట‌లు కూడా కొన్ని అంత‌కుమునుపు మాట్లాడారు. సీఎంతో చిరు జ‌రిపిన లంచ్ మీట్ కు సంబంధించి కొన్ని  వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు, పెద‌వి విరుపు మాట‌లు చెప్పారు. ఇన్నీ  జ‌రిగిన త‌రువాత ఇప్పుడాయ‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకోబోతున్నాన‌ని స్వ‌యంగానే వెల్ల‌డించి, అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

Read more RELATED
Recommended to you

Latest news