కొడాలి నాని వ్యాఖ్యలపై చిరంజీవి ఫ్యాన్స్ నిరసన.. గుడివాడలో ఉద్రిక్తత

-

సినిమా ఇండస్ట్రీని రాజకీయం చేయొద్దంటూ.. పిచ్చికమీద బ్రహ్మాస్త్రం ప్రదర్శించొద్దంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపాయి. చిరు వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్​పై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అభిమానులు కృష్ణా జిల్లా గుడివాడలో ఇవాళ ఆందోళనకు దిగారు.

జై చిరంజీవ.. కొడాలి నాని డౌన్‌డౌన్‌’ అంటూ నినాదాలు చేశారు. కొడాలి నాని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో చిరంజీవి అభిమానులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి, పలువురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులను పోలీసులు నియంత్రించలేకపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version