పవన్ కళ్యాణ్‌కు CM జగన్ కౌంటర్..ఎమ్మెల్యే కావాలని ఆశపడుతున్నాడు !

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. ‘రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయినా తన జీవితం చంద్రబాబు కోసమే త్యాగం అంటూ ఒకాయన వ్యాన్ ను చూసి మురిసిపోతున్నాడు. తాను కూడా ఎమ్మెల్యే అయిపోతానని, ఎవరు ఆపుతారో చూస్తానని ప్యాకేజీ స్టార్, దత్తత పుత్రుడు అంటున్నాడు.

చంద్రబాబు, పవన్ దుష్టచతుష్టయం ఒకవైపు, ప్రజలను నమ్ముకున్న నేను ఒక వైపు ఉన్నాం’ అని అన్నారు. గుడివాడలో టిడ్కో ఇళ్ల పంపిణీ చేసిన సీఎం జగన్‌.. అనంతరం మాట్లాడారు. ఈరోజు దేవుడి దయతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని.. మనం కడుతున్నవి ఇల్లు కాదు.. ఊళ్లు అంటూ వ్యాఖ్యలు చేశారు. పేదలకు 300 అడుగుల టిడ్కో ఇళ్లు ఉచితంగా లబ్ధిదారులకు ఒక్క రూపాయితో ఇస్తామని చెప్పామన్నారు. లేవుట్ 257 ఎకరాల స్థలం సేకరించి ఒక పక్కన టిడ్కో ఇళ్లు, మరోపక్క ఇళ్ల స్థలాలు ఇచ్చి నిర్మాణం చేస్తున్నామన్నారు. వీటన్నింటి మధ్య ఈరోజు కొత్త గుడివాడ నగరం కనిపిస్తోందని సీఎం జగన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news