ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన ఖరారైంది. ఈనెల 28వ తేదీన నర్సీపట్నంలో పర్యటించనున్నారు సీఎం జగన్. ఈ పర్యటనలో భాగంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి, ఏలేరు – తాండవ అనుసంధాన పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందింది. 28వ తేదీన ఉదయం 10:20 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు విమానంలో చేరుకుంటారు సీఎం జగన్.
అక్కడి నుంచి హెలిక్యాప్టర్ లో నర్సీపట్నం మండలం బలిఘట్టం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులను కలిసి అక్కడి నుండి రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటలకి నర్సీపట్నం మండలం జోగునాధుని పాలెం చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఏలూరు – తాండవ అనుసంధాన పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం జగన్. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.