రేపు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

రేపు సీఎం వైయస్‌ జగన్‌ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చీమకుర్తిలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాల ఆవిష్కరణలో పాల్గొననున్నారు సీఎం వైయస్‌ జగన్‌. అనంతరం బహిరంగ సభలో సీఎం వైయస్‌ జగన్‌… ప్రసంగించనున్నారు.

ఇందులో భాగంగానే… రేపు ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నుంచి బయలు దేరనున్నారు సీఎం వైయస్‌ జగన్‌.

ఇక 10.35 గంటలకు చీమకుర్తి చేరుకోనున్న సీఎం వైయస్‌ జగన్‌… 10.55 గంటలకు చీమకుర్తి మెయిన్‌రోడ్డులోని బూచేపల్లి సుబ్బారెడ్డి కళ్యాణమండపం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డిల కాంస్య విగ్రహాల ఆవిష్కరణ చేయనున్నారు. అనంతరం బీవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ వద్ద బహిరంగ సభలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్. మధ్యాహ్నం 12.40 గంటలకు తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం జగన్.