మంత్రి పేర్ని నానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుకి వ్యతిరేకంగా సీపీఐ మాట్లాడ్డం లేదని పేర్ని నాని ఎలా అంటారు..? చంద్రబాబుకు వ్యతిరేకంగా మేం పెట్టిన సభలకు పేర్ని నాని రాలేదా..? అని చురకలు అంటించారు. వైసీపీ వైఫల్యాలను ప్రశ్నిస్తే చంద్రబాబు పేరు ప్రస్తావిస్తారా..? చంద్రబాబుతో పోల్చుకుంటున్న వైసీపీ.. చంద్రబాబు తరహాలోనే ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
మూడేళ్ల జగన్ పాలనలో ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చారా..? పేర్ని నాని విపక్షంలో ఒక విధంగా, అధికారం వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా..? అని అగ్రహించారు. పేర్ని నాని బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి… మోడి, జగన్ పోటీ పడుతూ ప్రజలపై భారం మోపుతున్నారని అగ్రహించారు.
పెంచిన విద్యుత్ ఛార్జీలతో పాటు, ఆగష్టులో మరోసారి బాదనున్నారని.. పేద, మధ్య తరగతి ప్రజలకు జగన్ కరెంటు షాక్ బాగా ఇచ్చారన్నారు. పోలవరం విషయంలో మోడీ, జగన్ పక్కా డ్రామా ఆడుతున్నారు… ఏప్రిల్ 19వ తేదీన ఛలో పోలవరంకి పిలుపును ఇస్తున్నామని మండిపడ్డారు.