ఏపీలో త్వరలోనే ముందస్తు ఎన్నికలు : సోము వీర్రాజు

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ చూస్తుంటే అప్పులు చేసి పథకాలకు పంచేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్ళేటట్లు ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బాంబ్ పేల్చారు. ఏ ప్రాంతం అభివృద్ధి కోసం బడ్జెట్ లో ప్రస్తవన లేదని.. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టు లకు ఎందుకు నిధులు కేటాయించలేదని ఫైర్ అయ్యారు. ఈ లెక్కన జగన్ ముందస్తు కు వెళ్ళడం ఖాయమని జోస్యం చెప్పారు. మసిపూసి మారేడు కాయ చేసే బడ్జెట్ ఇదని.. ఏ ప్రాంతాన్ని ఆలోచింపచేసే బడ్జెట్ కాదు ఇదని మండిపడ్డారు.

బడ్జెట్ ను చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తుందని.. పేయిడ్ ప్రభుత్వ వ్యవస్థ ఏపీలో త్వరలో తీసుకు వస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటన చేశారు. మాకు శక్తి కేంద్రాలు ఉన్నాయి…ఈ ప్రభుత్వానికి వాలంటీర్ వ్యవస్ధ ఉందని.. పంజాబ్ లో మేము మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయలేదు. వచ్చే ఎన్నికల్లో పంజాబ్ లో బిజెపి గెలుస్తుందన్నారు.

స్పెషల్ స్టేటస్ కన్న మనమే ఎక్కువ సాధించాం..అని అప్పట్లో చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో రెవెన్యూ లోటు 5వేల కోట్లు అంచనా ఉండగా నేడు 5వేల కోట్లకు చేరిందని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అప్పులు తోనే పాలన సాగిస్తుందని.. వైసిపి చేసిన అప్పులు వివరాలు ఎన్నిసార్లు అడుగుతున్నా స్పందించడం లేదని ఆగ్రహించారు. వైసిపి అప్పులు వివరాలు ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news