ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. పెన్షన్ రూ.3,000 పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జగన్ కేబినేట్. ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభం అయింది. మొత్తం 45 అంశాలతో కేబినెట్ ఎజెండా రూపొందించారు. ముందుగా జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కు ఆమోదం తెలిపిన కేబినెట్…వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పధకాల అమలుకు ఆమోదం తెలిపింది.
ముఖ్యంగా సామాజిక పెన్షన్ లను 2,750 నుంచి 3,000 పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే… విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్ కు ఆమోదం తెలుపనున్న కేబినెట్…మిచౌంగ్ తుఫాన్ నష్ట పరిహారం అందించేందుకు ఆమోదం తెలుపనుంది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు ఆమోదం తెలుపనున్న మంత్రిమండలి.ఆరోగ్య శ్రీ కింద 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఆమోదం తెలుపనుంది.