కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లాకు జీవియల్ నర్సింహరావు లేఖ రాశారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న ద్వైపాక్షిక, వివాదాస్పద సమస్యలు పై చర్చించాలని డిమాండ్ చేశారు. సూచనలు చేసే కమిటీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నానని.. ఫిబ్రవరి17న జరిగే సమావేశంలో మొదటి అజెండా లో తొమ్మది అంశాలు ఉన్నాయన్నారు. సవరించిన అజెండా లో ఐదు అంశాలు మాత్రమే ఉన్నాయని.. ఎపికి ప్రత్యేక హోదా అంశంతో తెలంగాణ కు సంబంధం లేదని పేర్కొన్నారు.
వైసిపి, టిడిపి, సిపిఎం లు రాజకీయ కోణంలో చూస్తున్నాయని.. సవరించిన అజెండాతో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఎపిలో రాజకీయ డ్రామాలు, నేతల నటనలు ఎక్కువ అని.. ఎపి సమస్యలు పై చర్చ ఈ కమిటీ లో జరగదనే చర్చ జరుగుతుందన్నారు. ఎజెండాలో నాలుగు అంశాలను తొలగించడానికి గల కారణాలను సమావేశం లో వివరించాలని.. కమిటీలో చేసిన నిర్ణయాలను అమలు చేసేలా చూడాలని కోరారు.
హోదా అంశంలో కేంద్రం, ఎపిల మధ్య చర్చలు జరిగేలా కమిటీ ని ఏర్పాటు చేయాలని కోరానని.. నేను పలు అంశాలను ప్రస్తావించినా… అమలు నిర్ణయం కేంద్రం చూసుకుంటుందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అనేది లేదు… నిధుల సమీకరణ కోసం కృషి చేయండని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా పై ఎవరి ప్రయత్నం వారు చేద్దామని తెలిపారు.