హ‌మారా స‌ఫ‌ర్ : రాజ‌ధాని యుద్ధం ముగిసిందా?

-

రోడ్డెక్కిన వారిని గౌర‌వించ లేదు
పిడికిలెత్తి నినదిస్తే హేళ‌న చేశారు
ఇప్పుడు మాత్రం దిద్దుబాటులో ఉన్నారు
అయినా ఆ భూమి అమ్మ‌కండి బొత్స గారూ!
అని అంటున్నారు అమ‌రావ‌తి రైతులు.

 

సీఆర్డీఏ యాక్ట్ ప్ర‌కారం రాజ‌ధాని కి కేటాయించిన భూములు త‌న‌ఖా పెట్టేందుకు కూడా వీల్లేదు క‌దా మ‌రి రెండు వేల కోట్ల అప్పులు ఎలా తెచ్చారు? అన్నది విప‌క్షం వాద‌న.

నిన్న‌టి వేళ కోర్టు తీర్పు వెలువ‌డిన నేప‌థ్యంలో అమ‌రావ‌తి రైతులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.న్యాయ‌స్థానానికి వీరంతా సాష్టాంగ ప్ర‌ణామం చేశారు.అయితే ఈ యుద్ధం ఇప్పుడే ముగిసిందా అంటే చెప్ప‌లేం అంటున్నాయి వైసీపీ వ‌ర్గాలు.తాము ఇప్ప‌టికీ 3 రాజ‌ధానుల అభివృద్ధే ధ్యేయంగా ఉన్నామ‌ని అంటున్నాయి.ముఖ్య‌మంత్రి కూడా సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు ఉన్న అవకాశాలు ప‌రిశీలించాల‌ని న్యాయ నిపుణుల‌ను ఆదేశించారు. ఇదంతా చూస్తుంటే ఈ ఐదేళ్లూ రాజ‌ధాని గొడవ న‌డుస్తుందే కానీ తేలేలా లేదు.సంబంధిత వైసీపీకి పాల‌న సంబంధ ముగింపు కూడా ఆశాజ‌న‌కంగా ఉండ‌దు అని కూడా తేలిపోయింది.

మూడు పంట‌లు పండే నేల‌లు చూసి స్మ‌శానం అని అన్నారు మంత్రి బొత్స‌.ఇక్క‌డేం ఉంది ఏం లేదు..ఏవీ నిర్మించ‌లేదు.ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ల‌క్ష కోట్లు కావాలి అని అంటూ వ్యాఖ్య‌లు చేశారు.అంతేకాకుండా రాజ‌ధాని రైతుల‌ను ఉద్దేశించి కూడా చాలా సందర్భాల్లో హేళ‌న చేశారు.వారు అస్స‌లు రైతులే కాద‌ని అన్నారు.పెయిడ్ ఆర్టిస్టులు వాళ్లు అని మ‌నోవేద‌న‌కు గురి చేశారు.ఇప్పుడు హైకోర్టు తీర్పు నేప‌థ్యంలో  బొత్స మ‌ళ్లీ స్పందించారు.తీర్పు చ‌దివాక ఇంకా బాగా మాట్లాడ‌తార‌ని ఆశించాలి మ‌నం..అని అంటున్నారు రైతులు.

వాస్త‌వానికి చంద్ర‌బాబు స‌ర్కారు హ‌యాంలో అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించిన‌ప్పుడు వైసీపీ పెద్ద‌గా వ్య‌తిరేకించ‌లేదు. అదేవిధంగా రైతుల ద‌గ్గ‌ర నుంచి భూ సేక‌ర‌ణ పేరిట కొంత,స‌మీక‌ర‌ణ పేరిట కొంత పంట భూములు తీసుకుంటున్న‌ప్పుడు కూడా స్పందించ‌లేదు.ఆ రోజు కొన్ని గ్రామాలు రాజ‌ధానికి భూములు ఇవ్వాల‌ని చెబితే వ్య‌తిరేకించాయి.అది కూడా వైసీపీకి ప‌ట్ట‌లేదు. కానీ తాజా కోర్టు తీర్పు మాత్రం సహ‌జ న్యాయ సూత్రాల‌కు విరుద్ధం అని అంటోంది.ఇదీ టీడీపీ త‌ర‌ఫు వాద‌న.

ఎవ‌రి వాదన ఎలా ఉన్నా కూడా కోర్టు తీర్పు ఆధారంగా బొత్స‌తో స‌హా మిగ‌తా వాళ్ల కూడా నడుచుకోవాలి అని ఆశిస్తున్నారు అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ స‌భ్యులు. ముఖ్యంగా ఆ రోజు తాము ఎన్నో క‌ష్టాల‌ను దాటుకుని ఉద్య‌మాలు చేశామ‌ని, వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి తాము పోరాడుతున్నామ‌ని, పండ‌గలు,ప‌బ్బాలు అన్నీ కూడా దీక్షా శిబిరాల్లోనే చేసుకుని ఇక్క‌డే కాలం గ‌డిపామ‌ని,త‌మ క‌ష్టానికి ఫ‌లితం ద‌క్కింద‌ని అంటున్నారు రాజ‌ధాని రైతులు.

Read more RELATED
Recommended to you

Latest news