మరో నెలలో 50 వేల ఉద్యోగాల నోటిఫికేషన్‌ : మంత్రి హరీష్ రావు

-

మరో నెల, రెండు నెలల్లోనే 50 వేల ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే సీసీఐ వెంటనే పునరుద్దరించాలని.. బండి సంజయ్ కి నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేస్తూ ఉద్యోగాలు తీసివేస్తోందని.. దేశంలో పదిహేను లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి.. వెంటనే భర్తీ చేయాలని మంత్రి హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు. ఉద్యోగాలు నింపకుండా కాలయాపన చేస్తున్నారని… ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం, మూసివేయడం వల్ల రిజర్వేషన్ వర్గాలకు ఉద్యోగాలు దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాబోయే రోజులలో తెలంగాణ లో ఖాళీగా యాబై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని… కేంద్రం సీసీఐ పునప్రారంబిస్తే కొత్త పరిశ్రమకు ఇచ్చే రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు ముగియగానే పెట్రోల్ ధరలు మళ్లీ పెంచుతారని.. ఆర్టీసీ పై మోపిన డిజీల్ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు మంత్రి హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news