రేవంత్‌ రెడ్డి చేతగాని తనమే..పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌ – హరీష్‌ రావు

-

harish rao on patnam narendhar reddy: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్‌ రెడ్డి చేతకానీ తనమే ఈ అరెస్ట్‌ అన్నారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు.

harish rao

పచ్చని పొలాల్లో ఫార్మసిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలనా? అంటూ నిలదీశారు. నడి రాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా? అంటూ ఆగ్రహించారు. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరన్నారు. మీ బెదిరింపులకు BRSparty భయపడదు. ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతం. ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. అరెస్టు చేసిన పట్నం నరేందర్ రెడ్డి గారిని, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version