ఏపీలోని ఈ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు..!

-

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. కొన్ని జిల్లాల్లో వరుసగా స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ వస్తున్నారు. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 09 నాటికి వాయువ్య బంగాళఖాతం, గంగా పరివాహక వెస్ట్ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాల ప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశముంది.

దీంతో సగటు సముద్ర మట్టం వద్ద ఋతుపవన ద్రోణి బికనీర్, నార్నాల్, సిద్ధి, సంబల్పూర్, మధ్య బంగాళాఖాతం మరియు దాని ప్రక్కనే ఉన్న ఉత్తర బంగాళాఖాతం మీదుగా ఏర్పడి ఉన్న అల్పపీడన ప్రాంత కేంద్రం గుండా కొనసాగుతోంది. రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం విషయానికి వస్తే.. ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశం ఉందని తెలిపింది.  ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version