ఎన్నికల రణక్షేత్రంలో మీది కృష్ణుడి పాత్ర అయితే.. నాది అర్జునుడి పాత్ర అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో సిద్దం మహాసభలో ప్రసంగించారు సీఎం జగన్. జగన్ ఏనాడు ఒంటరి కాదు.. దేవుడు, ప్రజలే నా తోడు, బలం అన్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు ఇతర తోడేళ్లు ఏకమయ్యారు. సంక్షేమం అభివృద్ధి పై ప్రతిక్షాలు దాడి చేస్తున్నాయి. దుష్టచతుష్టయం మీద యుద్ధం చేసేందుకు మీరు సిద్దమా..? అని ప్రజలను అడిగారు సీఎం జగన్.
పెత్తందారులు ఎవరిపైనా దాడులు చేస్తున్నారో ఆలోచించండి. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏం చేశారో ఆలోచించండి. గ్రామ సచివాలయాల ద్వారా 500 రకాల సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రతీ నెల 01వ తేదీనే పెన్షన్లువేస్తున్నాం. చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. పేదల ఖాతాల్లో చంద్రబాబు ఏనాడైనా ఒక్క రూపాయి వేశాడా..? అని ప్రశ్నించారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రతీ గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేశామని తెలిపారు. లంచాలు, వివక్షలేని వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు సీఎం జగన్.