AP Assembly: ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..జగన్‌ వస్తారా ?

-

AP Assembly: ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవాళ ఉదయం 9.46 నిమిషాలకు ఏపీ అసెంబ్లీ సెషన్ ప్రారంభం అవుతోందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సెషన్ జరగనుంది. ప్రొటెం స్పీకర్ ఎన్నిక తర్వాత.. ఈ సెషన్లో ఇటీవల కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Jagan takes on Chandrababu in AP Assembly

ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. టీడీపీ కూటమికి సభలో ఫుల్ మెజార్టీ ఉండటంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇక, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తొలిసారిగా జరుగుతోన్న అసెంబ్లీ సెషన్ ఇదే కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ హాజరు అవుతారా లేదా అని ఆసక్తి నెలకొంది. అటు నేడు సీఎం హోదాలో గౌరవ సభకు చంద్రబాబు..వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version