YSR Jayanthi: చిన్నారికి పేరు పెట్టిన జగన్

-

కడప జిల్లా ఇడుపులపాయలో ఓ చిన్నారికి జగన్ పేరు పెట్టారు. వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించేందుకు చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ఓ వైసీపీ కార్యకర్త కూతురికి.. తన తల్లి పేరు కలిసి వచ్చేలా విజయశ్రీ అని నామకరణం చేశారు. తన రెండో సంతానంగా ఆడపిల్ల పుట్టిందని, చిన్నారికి పేరు పెట్టాలని కోరినట్టు వైసీపీ కార్యకర్త తెలిపారు.

YSR Jayanthi: చిన్నారికి పేరు పెట్టిన జగన్

ఇక అటు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిపై మాజీ సీఎం జగన్‌ సంచలన పోస్ట్‌ పెట్టారు. నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు అంటూ ఎమోషనల్‌ అయ్యారు మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారన్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరో ధార్యం.జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గమని తెలిపారు మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version