ఏపీ రైతులకు శుభవార్త చెప్పారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఒక పథకం ప్రకారం అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని.. నిత్యం ప్రభుత్వం పై ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారని ఆగ్రహించారు. వాటికి వివరణ ఇస్తున్నా..ప్రభుత్వం పై బురద చల్లుతున్నారని.. పంటల బీమా పై తప్పుడు కథనాలు రాస్తున్నారని పేర్కొన్నారు.
పండించిన ప్రతి పంటకూ బీమా కల్పిస్తున్నామని.. ప్రతి రైతుకూ బీమా కల్పించాలనే లక్ష్యంతో వంద శాతం ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తోందని వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలా చేయడం లేదని.. వై.సి.పి.అధికారంలోకి రూ. 6 వేల 684 కోట్ల మేర బీమా మొత్తం చెల్లించామని తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. టిడిపి హయాం తో పోలిస్తే ఇది రెట్టింపు మొత్తమని.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారని… ఇప్పుడు కరువు మండలమే లేదన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.