అబద్ధాన్ని 100 సార్లు చెప్పినా నిజం కాదు జగన్ : మంత్రి నిమ్మల

-

2014-2019 తెలుగు దేశం ప్రభుత్వ పాలనలో ఫేజ్ -1,ఫేజ్ -2, అని గానీ, ఎత్తు తగ్గింపు అని గానీ ఉంటే సాక్ష్యం చూపాలని సవాలు విసిరితే మండలిలో వైసీపీ సభ్యులు తోక ముడిచారు అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నేడు పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారు అంటూ విష ప్రచారానికి, మొసలి కన్నీటికి సమాచార హక్కు చట్టం ద్వారా పిపిఎ ఇచ్చిన సమాధానం వైసీపీ కి చెంపదెబ్బ. పోలవరం చరిత్రలో 41.15 మీటర్లు అంటూ ఫేజ్-1 కు బీజం పడింది. 45.72 మీటర్ల కు కాకుండా 41.15 మీటర్ల ఎత్తుకే నీళ్లు నింపడం అనే ప్రతిపాదన 2021 లో గత ప్రభుత్వమే కేంద్రానికి ప్రతిపాదన పంపిందని పీపీఏ కుండబద్దలు కొట్టింది. ప్రధాన డ్యామ్ లో 41.15 మీటర్ల ఎత్తు కు నీటి నిల్వ పరిమితం చేయాలనే నిర్ణయం తీసుకున్నది గత ప్రభుత్వమే అని పీపీఏ తేల్చి చెప్పింది.

ఎత్తు తగ్గింపు, ఫేజ్ 1,ఫేజ్-2 ల విభజన, డయాఫ్రమ్ వాల్ విధ్వంసం అన్ని గత అరాచకపాలన లోపాలే. అబద్ధాన్ని 100 సార్లు చెప్పినా నిజం కాదు, అన్న సత్యాన్ని జగన్ గ్రహించాలి. ఆంధ్రుల జీవనాడి రాష్ట్ర ఆర్ధిక సంపద పెరుగుదలకు ఆధార బిందువు పోలవరం ప్రాజెక్ట్. మా నాయకుడు చంద్రబాబు ఆలోచన నదుల అనుసంధానం ప్రక్రియకు అసలు పునాది పోలవరం. ప్రాజెక్ట్ 45.72 మీటర్ల ఎత్తు కు నిర్మాణం విషయంలో మావిధానం , మా ఆలోచన, మా చిత్తశుద్ధి వజ్రతుల్యం. చంద్రబాబు సారథ్యంలో పోలవరం పూర్తి చేస్తాం. గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్ర,ఇటు రాయల సీమ ప్రాంతాలకు తీసుకొస్తాం అని నిమ్మల రామానాయుడు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version