హంద్రీనీవ ప్రాజెక్ట్ లో భాగంగా పుంగనూరు బ్రాంచ్ కెనాల్ విస్తరణ పై ఇరిగేషన్ అధికారులు, ఎన్.సి.సి సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు మంత్రి నిమ్మల రామానాయుడు. వైసీపీ పాలనలో నిధులు కేటాయించకపోవడంతో విస్తరణ పనులు నిలిచి పోయాయి అని అఆయన అన్నారు. అలాగే దోపిడీ లూటీ పై పెద్దిరెడ్డి పెట్టిన శ్రద్ధ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ విస్తరణ పై పెట్టి ఉంటే పూర్తయ్యేది అని తెలిపారు.
ఇక తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు నీరు అందకుండ అడ్డుకున్న ద్రోహులు జగన్, పెద్దిరెడ్డిలు. ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు పుంగనూరు బ్రాంచ్ కెనాల్ విస్తరణ పై ప్రత్యేక దృష్టి పెట్టాం. రాయల సీమ జిల్లాల ప్రజలకు సాగు, తాగు నీరందించేలా హంద్రీనీవ కాలువల విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాంఅని పేర్కొన మంత్రి.. తెలుగుదేశం ప్రభుత్వంలో హంద్రీనీవ కు 5 వేల కోట్లు ఖర్చు పెడితే YCP వంద కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు అని పేర్కొన్నారు.