టీడీపీలో చేరేందుకు ఎంతో మంది వైసీపీ ఎమ్మెల్యేలు రెడీ – రఘురామ సంచలనం

-

 

తెలుగుదేశం పార్టీ నాయకత్వం, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు సిగ్నల్ ఇస్తే తమ పార్టీ నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి గారిని టీడీపీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్ గార్లు ఆయన నివాసానికి వెళ్లినట్లు తెలిసిందని, అలాగే నిజాలను నిక్కచ్చిగా మాట్లాడే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కూడా పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం ఉందని అన్నారు రఘురామ.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు నిర్వహిస్తున్న పాదయాత్రకు ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు సంఘీభావం తెలిపారని, దశాబ్దాలుగా రాజకీయాలలో కొనసాగుతున్న కుటుంబాలకు చెందిన రెడ్డి నాయకులు ప్రతిపక్షాల వైపు చూడడం ఆ పార్టీ పెరుగుదలను సూచిస్తుందని, ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబాలకు చెందిన వ్యక్తులను తమ పార్టీ పెద్దలు ఏక వచనంతో సంబోధించడం వల్లే ఈ దుస్థితి దాపురిస్తోందని అన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు కొంత మంది తమ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కలిసినట్లు తెలిసిందని, అలాగే మా జిల్లాకు చెందిన కొద్ది మంది నాయకులు కూడా టీడీపీ నాయకత్వంతో టచ్ లో ఉన్నారనే సమాచారం తనకు ఉందని, రాయలసీమ జిల్లాలకు చెందిన తమ పార్టీ నాయకులు సైతం టీడీపీలో చేరేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version