అక్రమ ఆస్తుల కేసులో పంచాయతీరాజ్ ఉద్యోగుల అరెస్ట్

-

విజయవాడ: ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్న పంచాయితీ రాజ్ ఉద్యోగులు రుద్రరాజు, వీరమాచినేని సుధాకర్ లను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. పంచాయితీ రాజ్ విభాగంలో పనిచేస్తూ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో రుద్రరాజు, వీరమాచినేని సుధాకర్ ఉద్యోగుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు ఏసీబీ అధికారులు. రెండు రోజుల ఏసీబీ సోదాల్లో కోట్ల రుపాయల భూములు , ఆస్తులు, నగదు, బంగారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు.

 

ఆక్రమ ఆస్తులు గుర్తించడంతో ఏసీబీ కోర్టులో హజరుపరిచారు ఏసీబీ అధికారులు. దీంతో వీరమాచినేని సుధాకర్, రుద్రరాజులకు 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. చిత్తూరు జిల్లా పంచాయితీ రాజ్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు రుద్రరాజు. పార్వతీపురం మన్యం జిల్లా పంచాయితీ రాజ్ విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు వీరమాచినేని సుధాకర్.

Read more RELATED
Recommended to you

Latest news