ప్రపంచ దేశాలు మోదీ నాయకత్వాన్ని ఆరాధిస్తున్నాయి – ఎంపీ లక్ష్మణ్

-

మహా సంపర్క్ అభియాన్ పేరుతో ప్రధాని స్థాయి నుంచి బూత్ స్థాయి కార్యకర్తల వరకు నివేదిక రూపంలో ప్రజల ముందుకు రానున్నామని తెలిపారు బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. మే 30 నుంచి జూన్ 30 వరకు తెలంగాణలోని ప్రతి ఊరికి బీజేపీ వెళ్తుందన్నారు. ప్రపంచ దేశాలు మోడీ నాయకత్వాన్ని ఆరాధిస్తున్నాయన్నారు. రాష్ట్రాలవారీగా అభివృద్ధి నివేదికలు రూపొందించి ప్రజల ముందుకు వెళ్తున్నామన్నారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 303 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జాతీయస్థాయి, రాష్ట్రస్థాయిల్లో కార్యవర్గ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయని వివరించారు. ధన్యవాద్ మోడీ పేరుతో ఓబీసీ సమ్మేళన సదస్సులు నిర్వహించాలని ఓబీసీ మోర్చా నిర్ణయం తీసుకుందన్నారు లక్ష్మణ్. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని స్పష్టం చేశారు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే కెసిఆర్.. పంటనష్టపోతే స్పందించలేదని మండిపడ్డారు.

పంట నష్టం జరిగి రైతులు, కౌలు రైతులు ఇబ్బందుల్లో ఉంటె కెసిఆర్ సర్కార్ పట్టించుకోలేదని ఆరోపించారు. 10 వేలు ఇస్తామని చెప్పిన టి సర్కార్ ఒక్కరూపాయి విడుదల చేయలేదన్నారు. కేంద్రప్రభుత్వ పథకం ఫసల్ భీమాను తెలంగాణలో అమలు చేయకుండా రైతుల నోట్లో మన్నుకొట్టారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news