పోర్ట్ అధికారులు నాకే కథలు చెప్తున్నారు : పవన్ కళ్యాణ్

-

పోలీస్, సివిల్ సప్లై,పోర్ట్ అధికారులు చాలా నామ మాత్రం గా యాక్షన్ తీసుకుంటున్నారు. కాకినాడ స్మగ్లింగ్ కి హబ్ అయిందని గతము లో చెప్పాం అని పవన్ కళ్యాణ్ అన్నారు. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు. 13 గోడౌన్ల లలో 51 మెట్రిక్ టన్నుల పేదలు బియ్యం సీజ్ చేసాం. 1000 లారీలు వెళ్లే పోర్ట్ కి 16 మందికి సెక్యూరిటీ ఉన్నారంటే అర్ధము అవుతుంది. సముద్రం లోపలికి వెళ్లి చూస్తాను అంటే డిప్యూటీ సీఎం అయిన నాకు పోర్ట్ అధికారులు సహకరించలేదు.

ఇక్కడ చాలా డీప్ నెట్ వర్క్ ఉంది. నన్ను రావొద్దని చాలా మంది చెప్పారు. కాకినాడ పోర్ట్ లో స్మగ్లింగ్ కి అనుమతి ఇవ్వలేదు. రైస్ చూస్తా అంటే పోర్ట్ అధికారులు షిప్ చుట్టూ తిప్పుతున్నారు. పోర్ట్ అధికారులు నాకు కథలు చెప్తున్నారు. ఏపీ కి గంజాయి కి అడ్డాగా మారిపోయింది. రైస్ ఒక్క విషయం కాదు.. ఇక్కడ చాలా సెక్యురిటి సమస్యలు ఉన్నాయి. కసబ్ సముద్ర మార్గం లోనే ఇండియా కి వచ్చాడు. ఎస్పీని స్టార్టింగ్ రోజు అడిగాను.. ఇప్పటి వరకు రిపోర్ట్ లేదు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version